మంత్రి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్గద్వాల విజయలక్ష్మి,కమిషన్ సభ్యులు.

హైదరాబాద్, మే 17,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి,
కమిషన్ సభ్యులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసారు. మహిళా కమిషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు అయిన తరువాత మర్యాదపూర్వకంగా మంత్రి సీతక్క తో భేటీ అయ్యారు. నూతనంగా నియమితులైన చైర్ పర్సన్, సభ్యులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు , ప్రభుత్వానికి పేరు తెచ్చేవిధంగా కమిషన్ కలసికట్టుగా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. మహిళల సమస్యలపై సత్వరమే స్పందించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *