బేగంపేట, మే 17,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ డివిజన్ నూతన అధ్యకుల జాబితా ను టి పి సి సి అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ విడుదల చేశారు.వీరిలో బేగంపేట డివిజన్ అధ్యక్షుడిగా మహమ్మద్ నసీర్(అడ్డూ)నియమితులయ్యారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అడ్డూ పార్టీకి ఎంతో కాలంగా సేవలు అందించారు.నసీర్ సేవలను గుర్తించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుధాం ఈ విషయాన్ని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమ దృష్టికి తీసుకెళ్లారు. సికింద్రాబాద్ డి సి సి అధ్యక్షుడు దీపక్ జాన్ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నూతన డివిజన్ అధ్యక్షుల పేర్లతో జాబితాను టి పి సి సి కి పంపించారు.టి పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో నూతన అధ్యక్షుల జాబితా విడుదల చేశారు.బేగంపేట డివిజన్ అధ్యక్షుడిగా మహమ్మద్ నసీరుద్దీన్(అడ్డు)నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన టీ పీ సీ సీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,సికింద్రాబాద్ డి సి సి అధ్యక్షుడు దీపక్ జాన్,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమ,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విశాల్ సుధాం లకు నసీరుద్దీన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ మాట్లాడుతూ తమ నాయకురాలు కోట నీలిమ నేతృత్వంలో విశాల్ సుధాం ఆధ్వర్యంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.
సనత్ నగర్ నియోజక వర్గం వివిధ డివిజన్ల అధ్యక్షులు వీరే.
సనత్ నగర్ నియోజక వర్గం డివిజన్ అధ్యక్షుడిగా అబ్బాస్ షరీఫ్, అమీర్ పేట్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్,ఎస్సార్ నగర్ అధ్యక్షుడిగా రవి కిరణ్ దేవులపల్లి, బి.కె గూడా డివిజన్ అధ్యక్షుడిగా శివలింగాల రవికాంత్, రామ్ గోపాల్పేట డివిజన్ అధ్యక్షుడిగా త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్, పద్మారావు నగర్ డివిజన్ అధ్యక్షుడిగా మెరుగు జగదీశ్వర్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడిగా గండు బెరుగల రమేష్ బాబు, బేగంపేట డివిజనల్ అధ్యక్షుడిగా మహమ్మద్ నజీర్ (అడ్డు) నియమితులయ్యారు.

