దర్శిలో నూతనంగా ఏర్పాటు చేసిన సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, గెలాక్సీ గ్రానైట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శిద్దా సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా
యువ పారిశ్రామికవేత్త, గెలాక్సీ గ్రానైట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శిద్దా సుధీర్ మాట్లాడుతూ ఆర్థిక రంగంలో సుందరం ఫైనాన్స్ సంస్థ విశ్వసనీయ సేవలను అందిస్తూ ప్రజల ఆదరణ పొందిందన్నారు. దర్శి ప్రాంత ప్రజలకు రుణాలు, వాహన ఫైనాన్స్, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన సేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం శిద్దా సుధీర్ కుమార్ ను సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పి భూషణం, జోనల్ మేనేజర్ శంకర్ నారాయణ, టెరిటోరియల్ మేనేజర్ శ్రీధర్, ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ కే వి వి ఎస్ ఎన్ ప్రసాద్, ఒంగోలు ట్రాక్టర్ బ్రాంచ్ మేనేజర్ డి హనుమయ్య, మార్కాపురం బ్రాంచ్ మేనేజర్ ఎం గౌరీ శంకర్, కందుకూరు బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ , స్థానిక వ్యాపారవేత్తలు, నాయకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

