తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో గురువారం బక్రీదు పండుగను ఘనంగా నిర్వహించారు. తూర్పుగంగవరం, మల్కాపురంలలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆయా ఈద్గాహ్ వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేశం, రాష్ట్రం ప్రజలు నుఖశాంతులతో ఉండాలని ప్రార్థనలు చేశారు. మల్కాపురంలో మాజీ సర్పంచ్ షేక్ కాలేషావలి, పలు పార్టీ ముస్లీం నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యత, సౌభ్రాతృత్వానికి బక్రీద్ పండుగ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ప్రార్ధనల అనంతరం భక్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రముఖులు, యువకులు, ముస్లిం పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

