ఘనంగా 302వ అన్నదాన కార్యక్రమం

జూన్ 14, (జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మహానగరంలో ఆకలితో అలమటిస్తున్న నిరాశ్రయులు, అనాథలు, సంచార జాతుల ఆకలి తీర్చడమే ధ్యేయంగా స్కై ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో 302వ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ప్రత్యేక వాహనంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ ఆకలితో అలమటిస్తున్న అనాథలను, నిరాశ్రయులను మరియు సంచార జాతుల వారిని మానవతా దృక్పథంతో గుర్తించి, వారికి రుచికరమైన భోజనాన్ని పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పావని.ఓ, సేవా సభ్యులు అఖిల్ తదితరులు పాల్గొని స్వయంగా ఆహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో ఆకలితో బాధపడుతున్న తోటి మానవులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. మానవీయ కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి నిరంతర సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *