హైదరాబాద్ జులై 15,(జే ఎస్ డి ఎం. న్యూస్) :
ప్రకాశం నగర్ డివిజన్ పరిధిలోని తాతా చారి కాలనీ,పరిధిలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని బి ఆర్ ఎస్ నాయకులు టి.శ్రీహరి,పి.సురేష్ యాదవ్ లు బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా బి ఎల్ ఓ,బి ఎల్ ఏ లతో మాట్లాడి ఓటర్ల జాబితా వెరిఫికేషన్, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు.

