సికింద్రాబాద్, జూలై 18 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సరూర్‌నగర్ స్టేడియంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ పిలుపు మేరకు నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి యువత భారీగాతరలివెళ్లింది. కంటోన్మెంట్
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇంచార్జి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో తరలిన ఈ యువ విభాగానికి బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, లోకనాథం, పాండు యాదవ్, అనిత ప్రభాకర్, నళిని కిరణ్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
అంతకుముందు కంటోన్మెంట్ 4వ వార్డులోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద మన్నె క్రిషాంక్ఆధ్వర్యంలో యువకులు నిరసన చేపట్టారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను పూర్తిగా విస్మరించిందని, ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, విద్యా భరోసా కార్డు వంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని క్రిషాంక్
మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను చించివేసి ఆందోళన వ్యక్తం చేసిన అనంతరం, నిరుద్యోగుల గళాన్ని వినిపించేందుకు సరూర్‌నగర్ సభకు సంఘీభావంగా భారీ కేడర్‌తో తరలివెళ్లారు.
