బేగంపేట జులై 20,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహంకాళి అమ్మవారి జాతరకు 200 సంవత్సరాల చరిత్ర ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాత్రి రాణిగంజ్ లో అమ్మవారి ఘటాల ఊరేగింపు లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఘటాలను దర్శించుకుని పూజలునిర్వహించారు. అనంతరం ఘటాలనిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఆషాడ మాసం వచ్చిందంటేనే జంటనగరాలు ఎంతో సందడిగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట రాంగోపాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్,కొండాపురం మహేష్ యాదవ్, రమణ, ప్రేమ్, కుమార్ యాదవ్, నాగభూషణం, దేశపాక శ్రీనివాస్, వెంకట్ బాబు తదితరులు ఉన్నారు.

