నాగులప్పలపాడు ,జులై, 27 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, జనసేన నాయకుడు పెంట్యాల కోటి, బిజెపి నాయకులు శిష్ట్లా రంగయ్య లు సంయుక్తంగా తెలిపారు. సోమవారం నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో ఎస్టీ కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కూటమి నాయకులు సంయుక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారు తెలియజేశారు. సంక్షేమం అభివృద్ధి రంగాలలో రాష్ట్రం ముందు వెళ్తుందన్నారు. వైసిపి పార్టీలో రాష్ట్ర అభివృద్ధిని అడుగున అడ్డుకుంటున్నాయని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు తెలియజేశారు. ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మసిముక్కు భాస్కరరావు, పిన్నక శ్రీకాంత్, పెంట్యాల శ్రీనివాసరావు, ఆత్మకూరు వాసు, మాజీ ఎంపీటీసీ ఆశీర్వాదం, క్లస్టర్ ఇంచార్జిలు,కుంచాల నాగరాజు కొప్పర్తి నాగయ్య, ఉప్పుగుండూరు లక్ష్మీనారాయణ,, గద్దె త్యాగరాజు, నిడి కొండ వెంకట్, బెల్లం శ్రీనివాసరావు, కుంభా పార్వతి, పాప ,తెలగతోటి సుబ్బయ్య, గోగులముడి సింగరయ్య, కొంజేటి రామకృష్ణ, యెహోషువ, తదితరులు పాల్గొన్నారు.
