తిరుమలగిరి జులై 27,(జే ఎస్ డి ఎం న్యూస్) :
లాల్‌బజార్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అరైవ్ అలైవ్ ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ బి. సుమతి, మల్కాజిగిరి కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్-1 శ్రీ కె. రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు లాల్‌బజార్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, తిరుమలగిరి lo అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్
జి. శంకర్ రాజు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్
నియమాలను పాటించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్‌నుఉపయోగించాలన్నారు. ఫుట్‌పాత్‌లపై నడవాలని, ట్రాఫిక్ సంకేతాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చట్టబద్ధమైన వయస్సు రాకముందు వాహనాలు నడపకూడదని, అలాగే చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించేలా ప్రోత్సహించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించ కూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అవగాహన కల్పించారు.అదే
విధంగా విద్యార్థులు ట్రాఫిక్ సేఫ్టీ అంబాసిడర్లుగా మారి తమ కుటుంబ సభ్యులు,స్నేహితులు మరియు పరిసర ప్రాంత ప్రజల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. ఎల్. విజయలక్ష్మి, తిరుమల గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అదనపు ఇన్‌స్పెక్టర్ పి. రామనయ్య, ఉపాధ్యాయులు శ్రీనాథ్ శర్మ, భాగ్యవతి, విక్టోరియా,ఆర్. రామకృష్ణ, శ్రీనివాసరావు (పీ.ఈ.టీ.), ఇతర ఉపాధ్యాయులు మరియువిద్యార్థులు పాల్గొని ట్రాఫిక్ పోలీసుల రోడ్డు భద్రతాకార్యక్రమాన్ని అభినందించారు.


