కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమం, భవిష్యత్కు భరోసా, అన్ని ప్రాంతాలఅభివృద్ధి సాధ్యమని టిడిపి శ్రేణులు చెప్పారు. తాళ్లూరు మండలంలోని 16 పంచాయితీలలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. తాళ్లూరులో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక రంగ అకాడమి డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకుడు మానం రమేష్ బాబు, ఇడమకంటి సుబ్బా రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి కైపు నాగార్జున రెడ్డి, నవులూరి విద్యా సాగర్, నాగేశ్వర రావు, రామయ్య, ప్రసన్న, డానీ, మహిళా సంఘ నాయకురాలు నుజాత లు పాల్గొని కరువది నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి నివాసం వద్ద ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన కొస్తాంధ్ర ప్రగతి, సంక్షేమ విజయాలను వివరించారు. కొర్రపాటి వారి పాలెంలో టిడిపి రాష్ట్ర మాజీ యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

