సికింద్రాబాద్, ఆగస్టు 03 (జే ఎస్ డి ఎం న్యూస్) :చట్ట పాలన ద్వారా బాలల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం విశేష సేవలు అందించిన ‘ఆశ్రిత’ స్వచ్ఛంద సంస్థకు ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం లభించింది. 2025-2026 సంవత్సరానికి గాను బాలల పరిరక్షణను బలోపేతం చేయడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ సంస్థ ఈ గౌరవాన్ని అందించింది.
న్యూఢిల్లీలో ఇటీవల నిర్వహించిన బాలల హక్కులు, సామర్థ్యం మరియు సమృద్ధి సదస్సులో ఈ అవార్డును జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు భువన్ రిభు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ పురస్కారం అందుకున్న ఆశ్రిత సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఎస్. నాగరాజును ప్రోగ్రామ్ మేనేజర్ పర్వతాలు, నవీన్ రాజ్, సంతోష్, కొండాలు రెడ్డి, శేఖర్, తాతరాజు తదితరులు అభినందించారు. బాలల సురక్షితమైన, ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశ్రిత సంస్థ నిరంతరం శ్రమిస్తోందని ప్రతినిధులు కొనియాడారు.
