తెలంగాణ అభివృద్ధినిఅడ్డుకోవాలని గుజరాత్‌ నాయకత్వం కుట్ర సీఎం రేవంత్ రెడ్డి.తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతిఇవ్వకపోవడంపై కేంద్రంపై మండిపడ్డ రేవంత్.కేంద్రం తనను అడ్డుకున్నా, తన లక్ష్యాన్నిఅడ్డుకోలేరని వ్యాఖ్య.మోదీ గుజరాత్‌కు బ్రాండ్‌అంబాసిడర్‌గావ్యవహరిస్తున్నారని సీఎం ఆగ్రహం.

హైదరాబాద్ ఆగస్ట్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణఅభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్నాయకత్వం కుట్రలు చేస్తోందనిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంపై గుజరాత్ ఆధిపత్యాన్ని అందరూఖండించాలనిపిలుపునిచ్చారుకేంద్రం తనను అడ్డుకున్నా, తన లక్ష్యాన్ని మాత్రం అడ్డుకోలేరని అన్నారు. డిసెంబర్​లో ఫ్యూచర్​ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామన్నారు. తన విదేశీ పర్యటనలో ఎలాంటి గోప్యతా లేదని, మొత్తం షెడ్యూల్​ను విదేశాంగశాఖ ముందుంచామన్నారు. లండన్​ పర్యటన ముగించుకుని హైదరాబాద్​ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్రం, మోదీపై తీవ్ర
విమర్శలుగుప్పించారు.ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అని అన్నారు.
తెలంగాణముఖ్యమంత్రికి విదేశీ
పర్యటనకు అనుమతిఇవ్వకపోవడమనేది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే ఎన్నో దేశాల్లోపర్యటించారని, ఆయన సొంత రాష్ట్ర సీఎం కూడా ఎన్నో దేశాల్లో పర్యటించారన్నారని రేవంత్ రెడ్డి
అన్నారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తమకు ఎందుకుఅడ్డుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ ఫ్యూచర్​సిటీలో పెట్టుబడులకు ఎన్నో సంస్థలు ఆసక్తి చూపించాయని వివరించారు. మన యూనివర్సిటీలతో ఒప్పందానికి విదేశీ వర్సిటీలు ఆసక్తి చూపాయన్నారు. ప్రఖ్యాతవర్సిటీలతో ఎంవోయూలు చేసుకునేందుకే తాను అమెరికా పర్యటనతలపెట్టినట్లుగా వివరించారు. విదేశీ వర్సిటీలు మన వద్దకు వస్తే, మన విద్యార్థులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గుజరాత్​కు బ్రాండ్ అంబాసిడర్​లా వ్యవహరిస్తున్నారు.
ప్రధాని మోదీ గుజరాత్​కు బ్రాండ్ అంబాసిడర్​లా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భారత్​కు వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్​ రాష్ట్రానికే రావాలనిచూస్తున్నారన్నారనిఆరోపించారు. తన పర్యటనను అడ్డుకోవడం గురించిపార్లమెంటులోలేవనెత్తుతామన్నారు. యూకే, యూఎస్​పర్యటనకు ఒకే తరహా
వివరాలిచ్చామని రేవంత్ రెడ్డితెలిపారు. లండన్​ పర్యటనకు అనుమతి ఇచ్చి, అమెరికాపర్యటనను మాత్రం ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాజకీయకారణంతోనే అనుమతి ఇవ్వటం లేదని విదేశాంగశాఖ బదులిచ్చిందన్నారు. అసలు రాజకీయ కారణం అంటే ఏమిటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను తెలంగాణ సీఎం, కాంగ్రెస్​ ముఖ్యమంత్రిని కావటమే రాజకీయ కారణమా అని ప్రశ్నించారు.
వైబ్రెంట్‌ గుజరాత్‌ పేరుతో ఆ రాష్ట్ర సీఎం అమెరికాలో ర్యాలీలు చేశారు. పెట్టుబడుల కోసం గుజరాత్‌ సీఎం అమెరికాలో 8 రోజులుపర్యటించారు. గుజరాత్‌ సీఎంకు అనుమతి ఇచ్చి, తెలంగాణ సీఎంను ఎందుకు అడ్డుకున్నారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని కేంద్రం, మోదీ పదేపదేప్రదర్శిస్తోందిరాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు మళ్లించుకునేందుకు కుట్ర చేశారు. నన్ను అడ్డుకోవటం, గుజరాత్‌ఆధిపత్యానికి నిదర్శనం. రాజకీయ వివక్షతో తెలంగాణను మోదీ అడ్డుకుంటున్నారు. కేంద్రం వైఖరిపై రాష్ట్ర బీజేపీ నేతలు నోరెత్తకపోవటం మరింతఅవమానమని రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు.
కేంద్రంలో ఉన్న కొందరు బీజేపీ నేతలు తన అధికార పర్యటనపై అవాస్తవాలు చెప్పి కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. విదేశీ పర్యటనకు దరఖాస్తుచేసినప్పుడు అన్ని విషయాలు స్పష్టంగాపేర్కొన్నామన్నారు.అమెరికాలో ప్రఖ్యాత
వర్సిటీలు, పెట్టుబడిదారులను కలుస్తామని చెప్పామన్నారు. రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నామని విదేశాంగ శాఖ బదులిచ్చిందని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *