బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.-

బేగంపేట ఆగస్ట్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బేగంపేట ప్రభుత్వ మహిళా స్వయం ప్రతిపత్తి (అటానమస్) డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ కోర్సులను బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామక ప్రకటనవెలువడింది. ఫిజిక్స్, సైకాలజీ, జువాలజీ, మైక్రో బయాలజీ, కంప్యూటర్ సైన్స్, బయో టెక్నాలజీ, బోటనీ, ఇంగ్లిష్, డిజిటల్ మార్కెటింగ్, సంస్కృతం తదితర సబ్జెక్టులలో బోధనా సిబ్బందిని ఎంపిక చేయనున్నట్లు ప్రిన్సిపాల్ డా.కే.పద్మావతి తెలిపారు.
సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) కలిగి ఉండాలి. ఐటీఈపీ (ITEP) కోర్సు బోధనకు పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ, నెట్, స్లెట్, సెట్ అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ వీరు లభించని పక్షంలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో బోధనా అనుభవం ఉన్నవారికి సర్వీస్ సర్టిఫికెట్ ఆధారంగా వెయిటేజీ కల్పిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 27న బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే ముఖాముఖి (ఇంటర్వ్యూ)కి ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపల్ డా. కే.పద్మావతి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *