రైలు కార్యకలాపాల భద్రతపై సమీక్ష.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.

హైదరాబాద్ ఆగస్ట్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్) సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జోన్ పరిధిలో రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వేఅదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల ప్రధాన అధిపతులు హాజరయ్యారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ మరియు నాందేడ్ మూడు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డిఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, నెలలో వివిధ శాఖల అధికారులు నిర్వహించిన రాత్రి తనిఖీలను సమీక్షించి, ఏవైనా లోపాలు కనుగొనబడితే వెనువెంటనే సవరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సురక్షితమైన, సజావైన రైలు కార్యకలాపాలను నిర్ధారించడానికి, ముఖ్యంగా ఓహెచ్‌ఈ / విద్యుత్ పరికరాల వద్ద పనిచేసే క్షేత్రస్థాయి, కాంట్రాక్ట్ సిబ్బందికి భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడంపై క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఆయన చెప్పారు. ఏదైనా పని చేసేటప్పుడు కార్యస్థల రక్షణపై నిరంతరం దృష్టి పెట్టడం, వివిధ విభాగాల మధ్య సజావైనసమన్వయం యొక్క ప్రాముఖ్యతను జనరల్ మేనేజర్ పునరుద్ఘాటించారు.
జనరల్ మేనేజర్‌ సిబ్బందికి క్రమం తప్పకుండా రిఫ్రెషర్‌ కోర్సులునిర్వహించాలని, తద్వారా తాజా భద్రతా ప్రమాణాలు, నియమనిబంధనలు నిర్వహణవిధానాలపై సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండేలా చూడాలని సూచించారు. అలాగే, స్టేషన్లు/రైళ్లలో, గూడ్స్ షెడ్లలో మరియు ఇంటర్‌లాకింగ్ లేని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పరిస్థితిని కూడా సమీక్షించారు. అంతే కాకుండా జోన్ వ్యాప్తంగా కొనసాగుతున్న వివిధ పనుల స్థితిని జనరల్ మేనేజర్ సమీక్షిస్తూ ఈ పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *