పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎగ్జిబిషన్–2026 – సందర్శించిన రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ ఆగస్ట్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్) : నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్ ఎగ్జిబిషన్–2026ను మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సంస్థ డైరెక్టర్లు వి. శివాజీ, కృష్ణారెడ్డి, డాక్టర్ ఎన్. నరసింహులు తదితర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రదర్శనలోని వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ రంగ ప్రస్థానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారుల భద్రతా ప్రమాణాలను ప్రజలకు సమగ్రంగా వివరించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు విద్యుత్ రంగంపై చక్కటి అవగాహన కల్పించడంలో ఈ ఎగ్జిబిషన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. వినూత్న రీతిలో ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహిస్తున్న టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్‌తో పాటు సంస్థ అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *