తాళ్లూరు మండల పరధిలోని తాళ్లూరు, కొత్త పాలెం, కొర్రపాటి వారి పాలెం గ్రామాలలోని పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై సోమవారం పశువుల దాణాను పంపిణీ చేసారు. పశువైధ్యాధికారి డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఎల్ నిలో పరిస్థితులలో ఈ దాణా చక్కడా ఉపయోగపడుతుందని, పాల ఉత్పిత్తి తగ్గకుండా చూసుకోవచ్చని అన్నారు. 50శాతం సబ్సిడీ పోను రూ. 555కు పశుదాణా అందిస్తున్నట్లు చెప్పారు. 140 మంది పాడి రైతులకు 7 టన్నుల పశువుల దాణా పంపిణీ చేసినట్లు వివరించారు.
