బేగంపేట ఆగస్ట్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట అన్నానగర్ ఎక్స్‌రోడ్స్ సమీపంలో లారీ వెనుక నుంచి కారును ఢీకొట్టడంతో, కారు ముందుకు దూసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బేగంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
పోలీసుల వివరాల ప్రకారంరామంతాపూర్కు చెందిన శ్రీనివాస చారి తన స్నేహితుడు కె. రాజశేఖర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై పటాన్చెరు నుంచి రామంతాపూర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోబాలంరాయ్ టాటా మోటార్స్ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందుకు దూసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో శ్రీనివాస చారి, రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం దెబ్బతింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్
కారణంగానే ప్రమాదం జరిగిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వాహనానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని కోరారు. బెగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారులకు స్వల్ప గాయాలు.
25
Aug