బేగంపేటలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు అరెస్ట్.

బేగంపేట ఆగస్ట్ 25 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
అన్నానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. బేగంపేట పోలీసుల వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మియథరి భానుప్రకాష్ (25), బాగావతం వంశీకృష్ణ (27) గంజాయి సేవిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.పోలీసులను గమనించిన ఇద్దరూతప్పించుకునేందుకు ప్రయత్నించగా వారినిపట్టుకున్నారు. విచారణలో గంజాయిసేవించినట్లుఅంగీకరించినప్పటికీ వారి వద్ద ఎలాంటి గంజాయి లభించలేదు. వారి సమ్మతితో నిర్వహించిన మూత్ర పరీక్షల్లో టీఎచ్‌సీ (THC)కు పాజిటివ్‌గా ఫలితం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.విచారణలో తాడ్‌బన్‌కు చెందిన ఫరూక్, అన్నానగర్‌కు చెందిన సన్నీ వద్ద నుంచి గంజాయి పొందినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫరూక్ పరారీలో ఉండగా, గంజాయి సరఫరాలో అతడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసును బెగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *