బేగంపేట ఆగస్ట్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్)
జీ ఐ జీ వర్కర్లు, అసంఘటిత కార్మికులసంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు.
రాంగోపాల్ పేట్ డివిజన్ మినిస్టర్ రోడ్ సాయి బాబా ఆలయంసమీపంలో ఆల్ ఇండియా అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్ & ఎంప్లాయీస్ కాంగ్రెస్ (కేకేసీ) గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎస్. అఖిల్ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికులు, జీ ఐ జీ వర్కర్లు, ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక కార్యక్రమంనిర్వహించారు. ఈ
కార్యక్రమంలో
ఆటో డ్రైవర్లకు ILWF యూనియన్ ID కార్డులు, అసంఘటిత రంగ కార్మికులు, GIG వర్కర్లకు KKC ఆధ్వర్యంలో రూ.50,000 ఆరోగ్య బీమా కార్డులను పంపిణీ చేశారు. KKC, Wellness Hospitals సహకారంతో ఈ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కార్మికులకు అందిస్తుండగా ఈ కార్యక్రమానికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరై కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ
మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులు, GIG వర్కర్లు, ఆటో డ్రైవర్లు నగర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రపోషిస్తున్నప్పటికీ అనేక
సందర్భాల్లో వారికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, సామాజిక రక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండటంలేదన్నారు. అలాంటికార్మికులకు అండగా నిలిచి, వారి సంక్షేమాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.అసంఘటిత, GIG వర్కర్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని డాక్టర్ కోట నీలిమ అన్నారు. వారి భద్రత కోసం రూ.5 లక్షల ప్రమాద బీమాతో పాటు మరిన్ని సంక్షేమ సదుపాయాలు కల్పించేలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. కార్మికులు ప్రమాదాలకు గురైనప్పుడు వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి కార్మికుడికి ఆరోగ్య, ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య భద్రతకు KKC, Wellness Hospitals కలిసి అందిస్తున్న రూ.50,000 ఆరోగ్య బీమా సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ILWF యూనియన్ ID కార్డుల పంపిణీ ద్వారా వారికి సంఘటిత గుర్తింపు, తమ హక్కుల కోసం ఒక వేదిక లభిస్తుందన్నారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికులు, GIG వర్కర్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం KKC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం, కార్మిక సంఘాలు సమన్వయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
మరోవైపు KKC గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మండలం ఎస్. అఖిల్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులు, GIG వర్కర్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమమే KKC ప్రధాన లక్ష్యమన్నారు. కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో Wellness Hospitals సహకారంతో రూ. 50,000 ఆరోగ్య బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్ల హక్కులు, సంక్షేమం కోసం ILWF యూనియన్ ID కార్డులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కార్మికులకు మరిన్ని సంక్షేమ, ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ నేతృత్వంలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్స్ పాల్గొన్నారు.

