ఘనంగా బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలు-దర్శి ప్రజలకుఎల్లప్పుడూ రుణపడి ఉంటాం- వైసిపి జిల్లా అధ్యక్షుడు దర్శి,ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తును అందించడమే కాకుండా ప్రజాసేవకు వెన్ను దన్నుగా నిలిచిన వైఎస్ కుటుంబానికి, తమను ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని దర్శి ఎమ్మెల్యే, వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ 70వ జన్మదిన వేడుకలు బుధవారం ఒంగోలులోని ఎ వన్ కన్వెన్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు వేలాదిగా తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
కుటుంబసభ్యుల సమక్షంలో వెంకాయమ్మ కేక్ కట్ చేశారు. అనంతరం వైసిపి శ్రేణులు, అభిమానులు గజమాలలు వేసి ఘనంగా సత్కరించి.. జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. తనపై చూపించిన అభిమానానికి వెంకాయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ, ప్రజాజీవితంలో ప్రజలు అందించిన ఆదరణను మరువలేనని పేర్కొన్నారు.
డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ తొలి నుంచీ ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగిన తమ కుటుంబాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డికి ప్రజలు అండగా నిలిచి రాజకీయంగా ప్రోత్సహించారని తెలిపారు.
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబ రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచారని చెప్పారు.
వెంకాయమ్మ కు జన్మదిన వేడుకలకు ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వైవి భద్రారెడ్డి , శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు,
మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, జంకె వెంకటరెడ్డి, అన్నా వెంకటరాంబాబు,
కుందూరు నాగార్జునరెడ్డి ,ఉడుముల శ్రీనివాసరెడ్డి, కసుకుర్తి ఆదెన్న,ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి చుండూరి రవిబాబు,రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు టిజెఆర్ సుధాకర్ బాబు, కొమ్మూరి కనకారావు, కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, వరికూటి అశోక్ బాబు ,
రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వై వెంకటేశ్వర్లు నాయుడు, బొట్ల రామారావు, పిడిసిసిబి మాజీ చైర్మన్ డాక్టర్ మదాసి వెంకయ్య, నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు పి.
మధుసూదన్ రెడ్డి, పాలడుగు రాజీవ్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఐవి నాగిరెడ్డి , మేధావి సంఘ కార్య దర్శి ఐ.వి సుబ్బారెడ్డి,జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షులు, అభిమానులు వేలాదిగా తరలిరావడంతో ఎ వన్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణం సందడిగా మారింది. ముందుగా చీమకుర్తిలోని దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి స్మృతి మందిరం వద్ద ఆయనకు బూచేపల్లి కుటుంబీకులు నివాళులు అర్పించారు. చీమకుర్తి లో బూచేపల్లి నివాసం వద్ద దర్శి ఒంగోలు లలో బూచేపల్లి అభిమానులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *