విద్యార్థులలో చిన్నతనం నుంచి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చెయ్యాల్సిన బాధ్యత ఉ పాధ్యాయులపైన, తల్లి దండ్రుల పైన ఉందని విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకు ముకి సైన్స్ సంబరాలు ప్రారంబోత్సవ కార్యక్రమం నిర్వహించారు . వి కే ఉ న్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మిల్టన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మాడ నమ్మకాలను వీడి సైన్స్పై అవగాహన పెంచుకోవాలని వక్తలు కోరారు. బికే పాడు జెడ్పీ హెచ్ఎం బ్రహ్మయ్య, జెవీవీ జిల్లా ఉ పాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర రావు, చెకు ముకి మండల కన్వినర్ ఆర్ సురేష్, ఉపాధ్యాయులు సింగా రెడ్డి శ్రీనివాస రావు, కరీం తదితరులు పాల్గొన్నారు.
