తాళ్లూరు – ముండ్లమూరు రోడ్లో ఒక మోటార్ సైకిలిస్ట్ ను ఇసుక ట్రాక్టర్ ఢీ కొన్న
సంఘటలో వ్యక్తి మృతి చెందాడు. విఠలాపురం గ్రామానికి చెందిన పాలె పోగు యలమంద (45) తాళ్లూరు నుండి విఠలాపురం ఆయన కుమారుడు రాజశేఖర్ తో కలిసి వెళ్తూ మార్గ మధ్యలో మూత్ర విసర్జన మోటార్ సైకిల్ నుండి దిగుతున్నారు. అదే సమయంలో వెనకు నుండి విఠలాపురం వైపు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ అకస్మాత్తుగా బైక్ ను
ఢీ కొట్టినది. దీంతో యలమంద కాలు విరిగినది. బైక్ ట్రాక్టర్ క్రింద పడి నుజ్జు అయినది. రాజశేఖర్ తృటిలో తప్పించుకున్నారు. యలమంద ను ప్రాధమిక వైద్యశాలలో చికిత్స అనంతరం ఒంగోలు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య చంద్రమ్మ, ఇరువురు కుమారులు అశోక్, రాజశేఖర్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి , పోష్టు మార్టమ్ నిమిత్తం తరలించారు.

