ఖరీఫ్ లో వేసిన వరి పంటకు ప్రతి రైతు పంటల భీమా చేయించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. అయ్యల పాలెం, వెలుగు వారి పాలెం గ్రామాలలో రైతులకు భీమా పై అవగాహన కల్పించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఖరీప్ మరో వేసవిలా మారిందని, బోర్ల లో నీరు నరిగా రానందున పంట దిగుబడి తగ్గుతాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆర్థికంగా ఆనరా కలుగుతుందని వ్యవసాయాధికారి తెలిపారు .
