వినియోగదారులకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యంగా విద్యుత్ సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని విద్యుత్ డీఈ పాలగిరి శ్రీనివాసులు అన్నారు. సిబ్బందితో తాళ్లూరు సబ్ స్టేషన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యధికంగా పెండింగ్లో ఉన్న బిల్లులను వసూలు చెయ్యాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని మీటర్లను ఏర్పాటు చేయించటంతో స్థానిక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. పీఎం సోలార్ ఘర్పై అవగాహన పెంచాలని, ఎస్సీలకు ఉచితంగా యూనిట్స్ ఇస్తున్న విషయాన్ని వివరించాలని కోరారు, ఎఈ రామక్రిష్ణా తదితరులు పాల్గొన్నారు.

