ఉభయ కమ్యునిస్ట్లతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలకు పోటీ – జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఉభయ కమ్యునిస్ట్ పార్టీలు, ప్రజాసంఘాలు, లౌకిక శక్తులు, ప్రజా స్వామ్య వాదులను కలుపుకుని జిల్లాలోని ఒంగోలు నగర్ మేయర్తో పాటు అన్ని మున్సిపల్, కార్పరేటర్, కౌల్సిలర్, చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచిల స్థానాలకు పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెన్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా తెలిపారు. ఒంగోలులో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా సైదా మాట్లాడుతూ గత రెండేళ్ల పాలనలో కూటమి పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. హామీల అమలులో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైనట్లు తెలిపారు. గత ఐదేళ్లలో వైఎన్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రజావ్యతిరేకత మూట కట్టుకున్నారని నేడు దే దారిలో టిడిపి ఉందని అన్నారు. పజ్రలు మూడవ ప్రత్యామ్నాయంగా కాంగ్రెన్ వైపు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఉపాధ్యక్షుడు రసూల్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ మన్నం ప్రనన్న రాజు, వేణు రాజు, గోరంట్ల కోటేశ్వరరావు, బుజ్జి, కిసాన్ సెల్ అధ్యక్షుడు కుండ్రుకుంట్ల సుబ్బా రావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మహ బూబ్ వలి, సుధీర్ వర్మ, శ్రీను, మధు, రావూఫ్, నుబ్బా రావు, నతీష్, మరియమ్మ, జాకబ్, పాలంక రెడ్డి శ్రీనివాసులు, ఇమ్రాన్, సుభాని, శ్రీనివాస రాజు, గురు బాబు, షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పలు తీర్మాణాలను ఆమోదించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *