హుస్సేన్‌ సాగర్‌లో మహిళ ఆత్మహత్యాయత్నంకాపాడిన లేక్‌ పోలీసులు.

హైదరాబాద్ ఆగస్ట్ 27,(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితను లేక్ పోలీసులు చాకచక్యంగా రక్షించారు. గురువారం నాడు సాగర్ వద్ద ఓ మహిళ బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నట్లు డయల్ 100కు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన లేక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు.
రక్షించిన మహిళను నాగరం పరిధిలోని రాంపల్లి సత్యనారాయణ కాలనీకి చెందిన పి.వందన (32)గా గుర్తించారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమె, కుటుంబంలో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగానే మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, మానసిక ధైర్యాన్ని నూరిపోస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికి, ఆమె బావమరిదికి సురక్షితంగా అప్పగించారు.
ఎవరైనా మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సకాలంలో అందించే సమాచారం ప్రాణాలను కాపాడుతుందని ఈ సందర్భంగా లేక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *