రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ శుక్రవారం ఒంగోలు నగర పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేయటంలో ఎలాంటి లోపాలు ఉండకూదు – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ శుక్రవారం ఒంగోలు నగర పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేయటంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, ఒంగోలు, కనిగిరి, గోపాలపురం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, ఉగ్ర నరసింహారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, తదితరులతో కలిసి వీటిని పరిశీలించారు. ముందుగా కిమ్స్ ఆసుపత్రి జంక్షన్ లో సర్వీస్ రోడ్డు వెంట చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించి, నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను లోకేష్ ఆవిష్కరిస్తారు. అనంతరం రంగారాయుడు చెరువు వద్ద అమృత్ – 2 పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ ఆవిష్కరిస్తారు. ఈ దృష్ట్యా సంబంధిత పనులను పూర్తి చేయడం, మంత్రి లోకేష్ చేత వీటిని ఆవిష్కరించడం లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ తో పాటు ప్రజాప్రతినిధులు వీటిని పరిశీలించారు. కాగా, వీటికి ముందుగా నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద ర్యాడిసన్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ, చివర్లో ఒంగోలులో కార్యకర్తల సమావేశంలోనూ మంత్రి లోకేష్ పాల్గొంటారని ఆయన కార్యాలయం తెలిపింది.
అధికారిక కార్యక్రమాల ఏర్పాట్ల పరిశీలనలో ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ యేసయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *