రూ.100 కోట్లతో ఒంగోలు సమీపంలో రాడిసన్ 5-స్టార్ హోటల్‌ -అంతర్జాతీయ ప్రమాణాలతో రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మాణం -స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు -రాడిసన్ 5 స్టార్ హోటల్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్ ను నిర్మించనున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి 5-స్టార్ హోటల్‌గా ఇది నిలవనుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న రాడిసన్ హోటల్‌లో 151 విలాసవంతమైన గదులు, మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్, ప్రీమియం బార్, లాంజ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్, లగ్జరీ స్పా, అత్యాధునిక ఫిట్‌నెస్ సెంటర్ వంటి వసతులను కూడా ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేట్ సమావేశాలు, సదస్సులు, ప్రభుత్వ కార్యక్రమాలు, వివాహాలు తదితర కార్యక్రమాల నిర్వహణకు 2,100 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో భారీ బ్యాంకెట్ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్‌లను నిర్మించనున్నారు. దీంతో ఒంగోలులో MICE, బిజినెస్ టూరిజం కార్యకలాపాలకు మరింత ఊతమివ్వనుంది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి NH-16కు ఆనుకుని ప్రాజెక్టు ఏర్పాటు కానుండటంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పర్యాటకులకు ఈ హోటల్ ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఒంగోలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించనుంది. రాడిసన్ హోటల్ ఏర్పాటుతో నిర్మాణ దశతో పాటు హోటల్ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగ నున్నాయి. వీటితో పాటు సమీప ప్రాంతాల్లో భవిష్యత్‌లో హోటల్ మేనేజ్ మెంట్ సంస్థల వచ్చే అవకాశం ఉంది.

కార్యక్రమం అనంతరం తనని చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగి ఆత్మీయంగా మంత్రి నారా లోకేష్ పలకరించారు. కార్యకర్తల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ రవి శంకర్, మంత్రి బాల శ్రీ వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కలెక్టర్ రాజాబాబు, టూరిజం ఏపీ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యం, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ, రవిశంకర్ గ్రూప్ సిబ్బందిలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *