ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఒంగోలులోని శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. మంత్రి రాక సందర్భంగా కళా శాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మంత్రి నారా లోకేష్ కు పూల బొకే అందజేసి సాదరంగా ఆహ్వానించారు. కళాశాల విద్యార్థినులు సైతం పూల బొకేలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థినులు ఆనందంతో కేరింతలు, కొట్టడంతో కళాశాల ప్రాంగణం మారుమోగింది. ఐటీ కంపెనీలు తీసుకొచ్చి, ఉద్యోగాలు కల్పిస్తున్న మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు అంటూ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థినిలతో మంత్రి నారా లోకేష్ఆప్యాయంగా ముచ్చటించారు. మంత్రి రాకతో విద్యార్థుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్ర మంలో శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, జిఎం శివరాం, డీన్ దాది ఆంజనేయులు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరామయ్య, నారాయణ, రమేష్ బాబు, ఏడుకొండలు, నాగేంద్ర, ఏఓలు ప్రతాప్, గిరీష్, విద్యాసంస్థల అధ్యాపక, అధ్యా పకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




