ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 13వ ప్లీనరీ సావనీరన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు అందజేశారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రాడిస న్ 5 స్టార్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకే ను శుక్రవారం ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో యూనియన్ ప్రతిని ధులు కలిశారు. ఈ సందర్భంగా సావనీర్లో ప్రచురించిన ఫొటోలను మంత్రి లోకేష్ తిలకించారు. ప్లీనరీకి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి ఐవీ సుబ్బారావు తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డీఎస్బీవీ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనస భ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్ విజయకుమార్, ఏలూరి సాంబశివరావు, ఇంటూరి నాగేశ్వరరావు, మారిటైం బోర్డు చైర్మ న్ దామచర్ల సత్య, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, యూనియన్ రాష్ట్ర కార్య దర్శి ఆలుగుల సురేష్, జిల్లా కార్యదర్శి కనకయ్య, నగర అధ్యక్షుడు కోటి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.


