అనేక దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు శాశ్వతంగా ఈ ప్రాంతంలో కరువును నివారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈనెల 31వ తేదీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కు సాగర్ జలాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కరువు నుంచి విముక్తి కల్పించాలన్న సంకల్పంతో 1996 మార్చి 5వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.
మూడు దశాబ్దాల నిరీక్షణకు ఈ నెల 31 వ తేదీన చంద్రబాబు ప్రారంభోత్సవంతో తెరపడనుందని అన్నారు. హెడ్ రెగ్యులేటర్ ,
టన్నెల్సు నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు.
వైసిపి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను దగా చేసిందన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారన్నారు. రెండేళ్ల కూటమిపాలనలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఒకవైపు శరవేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు .
వెలిగొండ ప్రాజెక్టు కు సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసి ఈ నెల 31 వ తేదీన జాతికి అంకితం చేస్తున్నామని అన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ఉమ్మడి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలోని 32 మండలాలు సస్యశ్యామలం కావడంతో పాటు 20 లక్షల మంది ప్రజలకు త్రాగు నీరు అందుతుందని అన్నారు.
ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు రెండవ టన్నెల్ లో టివిఎం తొలగింపు పనులను శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు .
రెండువేల క్యూసెక్కుల నీరు సామర్థ్యం కలిగిన ఫీడర్ కెనాల్ కు రంద్రాల పడి గ్రామాల మీదకి వరద నీరు పడుతున్నప్పటికి గత వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2026 జనవరిలో రూ 460 కోట్లతో 11 కిలోమీటర్లు లైనింగు నిర్మాణ పనులను చేపట్టి శరవేగంగా పూర్తి చేశామన్నారు.
ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని విమర్శించారు
తమ ప్రభుత్వం కేవలం 40 రోజుల వ్యవధిలోనే రూ 680 కోట్లు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి నిర్వాసితుడికి పరిహారం ఇవ్వడం జరుగుతుందని,
చివరి వ్యక్తి పరిహారం అందుకునేంత వరకు ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఆర్ఆర్ ప్యాకేజీ అందని ఆయా గ్రామాలలోని నిర్వాసితుల వివరాలను తెలుసుకునేందుకు అధికారులతో కమిటీలు వేశామని, వారంతా ఆయా గ్రామాలలో ప్రజలను కలిసి అర్జీలను స్వీకరిస్తున్నారని అన్నారు.
వెలిగొండ జలాలతో లబ్ధి పొందే వారి కంటే అందుకు త్యాగం చేసిన నిర్వాసితులు ఒక మెట్టు పైనే ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
ప్రతి ఒక్కరికి పరిహారం ఇస్తాం…
సోషల్ ఎకనామిక్స్ సర్వే లో వున్న ,లేకపోయినా పరిహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మిస్సయిన ప్రతి పేరును పరిగణంలోకి తీసుకొని పరిహారం అందించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లోనే ఓ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిపై విచారణ చేసి పరిహారం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి నిర్వాసితుడికి పరిహారం అందించాలన్న ఉద్దేశంతో మరో రూ 169 కోట్లు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నారు.
కావున ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామని భరోసా కల్పించారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రెండు లక్షల ఎక్స్ప్రెస్ గ్రేషియా
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో 2026 నాటికి 18 సంవత్సరాల నిండిన యువతకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల మేరకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి అన్నారు .
మహిళలకు రక్షాబంధన్ కింద చీర పసుపు కుంకం
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలోని ఏడువేల కుటుంబాల మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ ద్వారా పసుపు కుంకుమ చీర పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని సోదరీమణులకు ఈ కానుకను ముఖ్యమంత్రి అందజేయనున్నారు. ప్రతి మహిళకు పసుపు, కుంకుమ, గాజులు చీరతో ఒక కిట్టుగా అందజేయడం జరుగుతుందని అన్నారు.
*నెలరోజులకు ముంపు గ్రామాల నిర్వాసితులకు నిత్యవసర సరుకులు పంపిణీ
ముంపు గ్రామాలలోని నిర్వాసితులకు నెల రోజులకు సరిపడు నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. కందిపప్పు బియ్యం నూనె సబ్బులు గోధుమపిండి వీటన్నిటిని ఒక ప్రత్యేక కిట్టుగా నిర్వాసితులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. సొంత ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతున్న త్యాగదనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిత్యవసరకులు పంపిణీ చేసే క్రియను ప్రభుత్వం చేపట్టిందన్నారు. అధికార యంత్రాంగం ప్రతినిర్వాసుడికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎర్రగొండపాలెం నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరీక్షన్ బాబు, ఆర్డిఓ ఎమ్. శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
