హైదరాబాద్, ఆగస్టు 29, (జే ఎస్ డి ఎం న్యూస్ )
దేశంలో సుమారు 22 లక్షల నుంచి 65 లక్షల మంది వరకు కాళ్లలోని సిరలకు సంబంధించిన సమస్యలకారణంగా వచ్చే దీర్ఘకాలిక పుండ్లతోబాధపడుతున్నట్లుఅంచనాలు ఉన్నప్పటికీ.ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహనతక్కువగా ఉందని *కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, వాస్క్యులర్ సర్జన్ డా.
నరేంద్రమేడా అన్నారు. ఈ నేపథ్యంలో సిరల సంబంధిత కాళ్ల పుండ్లపై అవగాహన కల్పించేందుకు ఉర్గో ఫౌండేషన్ఆధ్వర్యంలో చేపట్టిన ‘వాక్‌ఫ్రీ’ కార్యక్రమాన్నిసికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలోప్రారంభించారు.భారతదేశంలో ఈ కార్యక్రమానికి
ఇదే తొలి
అవగాహనకార్యక్రమం. రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్య నిపుణులు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. మేడామాట్లాడుతూ సిరల్లో రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కాళ్లపై ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం మానకపోవచ్చు. దాదాపు 40 శాతం మంది రోగుల్లో రెండు నుంచి నాలుగేళ్ల వరకు పుండ్లుకొనసాగుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఒకసారి మానిన తర్వాత కూడా తిరిగి వచ్చే అవకాశాలు అధికంగాఉంటాయి. ఐదేళ్లలో 70 శాతం వరకు పుండ్లు మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
ఈ సమస్య 36–60 ఏళ్ల వయసు వారిలోగణనీయంగా కనిపిస్తుండటంతో కుటుంబాలపై, ఉపాధిపై కూడా ప్రభావం పడుతోంది. ఎక్కువ కాలం పుండ్లతోబాధపడటం వల్ల నడక, రోజువారీకార్యకలాపాలు, ఉద్యోగ సామర్థ్యం, జీవన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు.కాళ్లపై ఏర్పడే పుండ్లను సాధారణగాయాలుగా భావించకూడదు. ఇవి దీర్ఘకాలం కొనసాగడంతోపాటు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశంఉంటుంది. రోగులు చికిత్సను సక్రమంగాపాటించడం, వ్యాధిపై అవగాహనపెంచుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు.
కార్యక్రమంలో ప్రధానంగా కంప్రెషన్ థెరపీ (కుదింపు చికిత్స) పై అవగాహన కల్పించారు.కాళ్లపై ప్రత్యేకమైన కుదింపుబ్యాండేజీలు ఉపయోగించడం ద్వారా సిరల్లో రక్తప్రసరణను మెరుగుపరచడంలో, పుండ్లు మానడంలో సహాయపడవచ్చని వివరించారు. ముఖ్యంగామల్టీకాంపోనెంట్ కంప్రెషన్ బ్యాండేజీలు నిరంతరకుదింపును అందించడంతోపాటు, రోగులకు ధరించే సమయంలో సౌకర్యవంతంగా ఉండేలారూపొందించినట్లు తెలిపారు.
ఒకే రకమైన బ్యాండేజీపై ఆధారపడటం కంటే వైద్యుల సూచన మేరకుమల్టీకాంపోనెంట్ కంప్రెషన్ విధానాన్నిపాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను రోగులు, వారి కుటుంబ సభ్యులకు వివరించారు. చికిత్సను మధ్యలో ఆపకుండా,వైద్యులు సూచించిన విధంగా కుదింపు చికిత్సను కొనసాగించడం ఎంత ముఖ్యమో కూడాతెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్న రోగులు, కుటుంబ సభ్యులు వైద్య నిపుణులను తమ సందేహాలను అడిగితెలుసుకున్నారు.వెరికోస్ వెయిన్స్ తదితర సిరల సమస్యలతో వచ్చే దీర్ఘకాలిక కాళ్ల పుండ్లపైఅవగాహనను కేవలం ఆసుపత్రులకే పరిమితం చేయకుండా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ‘వాక్‌ఫ్రీ’ కార్యక్రమం లక్ష్యమని ఉర్గో ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. వ్యాధిని తొలిదశలో గుర్తించడం, సరైన చికిత్సతీసుకోవడం, వైద్యులసూచనలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా పుండ్ల తీవ్రతను తగ్గించడంతోపాటు తిరిగి వచ్చే
అవకాశాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అవగాహన క్రమం తప్పని చికిత్స.. సరైన సంరక్షణతో దీర్ఘకాలిక కాళ్ల పుండ్ల నుంచి బయటపడేందుకు మరింత మంది రోగులకుసహాయపడటమే ‘వాక్‌ఫ్రీ’ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
