పాతనగరం మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం.ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ లో క్షేత్ర పరిశీలన చేసినహెచ్ఎంఆర్ఎల్ అదనపు ఎండీ అజిత్ రెడ్డి.

పాతనగరం మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం.
ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ లో క్షేత్ర పరిశీలన చేసిన
హెచ్ఎంఆర్ఎల్ అదనపు ఎండీ అజిత్ రెడ్డి.
హైదరాబాద్ ఆగస్ట్ 29(జే ఎస్ డి ఎం న్యూస్) ;
పాతనగరం మెట్రో రైల్ విస్తరణకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలు తమ పనులను వేగవంతంచేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఓల్డ్ సిటీ లోని మెట్రో రైల్ కారిడార్ రోడ్ విస్తరణ పనుల తీరును క్షేత్ర
స్థాయిలోపరిశీలించారు. దారుష్షిఫా నుండి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న రోడ్ విస్తరణ పనులను మెట్రో రైల్ చీఫ్ ఇంజినీర్ ఎస్.భాస్కర్ రెడ్డి
తో కలిసి
పరిశీలించారు. ఈ మార్గంలో ప్రభావిత ఆస్తులు మొత్తం 888 కి గాను, ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 833 ఆస్తులనువివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. మిగిలిన 55 ఆస్తులలో ఉన్న వారసత్వ కట్టడాలు, పురాతన భవనాలు వెంబడి మెట్రో రైల్ మార్గం విస్తరణకు చేపడుతున్న చర్యలను కూడా
ఈ సందర్బంగా అధికారులతో చర్చించారు.
ఈ కారిడార్ లో ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలు, వాటర్ వర్క్స్ కి సంబంధించిన పైప్ లు, తదితర యుటిలిటీలు అడ్డంకిగామారకుండా వాటిని
సురక్షితంగా తరలించే పనుల ఇంకా వేగవంతం చేయాలనీ అదనపు ఎండీ అజిత్ రెడ్డి తెలిపారు.భూసేకరణ పూర్తి అయిన ప్రభావిత ఆస్తుల తొలగింపు త్వరిత గతిన పూర్తి
చేయాలనీ అదనపు ఎండీ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతనగరం మెట్రో పనులనుత్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సౌలభ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలనిసూచించారు. ఓల్డ్ సిటీ మెట్రో పనుల పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని అదనపు ఎండీ అన్నారు. ఈ కారిడార్ లోని జరిగే మెట్రో పనులతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలుసమన్వయంతో పని చేసి త్వరిత గతిన రైట్ అఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) వచ్చేలా కృషి చేయాలని అజిత్ రెడ్డి సూచించారు. అనేక సవాళ్ల మధ్య భూసేకరణకు విశేష కృషి చేసిన రెవెన్యూ అధికారులను ఆయనఅభినందించారు. క్షేత్ర పర్యటనలో మెట్రో రైల్ స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్ సి.వినోద్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే.శ్యామ్ మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఈ టి.రామచంద్రన్, ప్రాజెక్ట్ మేనేజర్ కే.నరసింగ రావు, భూసేకరణ డీజీఎం వి.ప్రవీణ్ కుమార్, జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్
కే.సత్యనారాయణ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, హెచ్ఎంఆర్ఎల్ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *