“నేనే శంకుస్థాపన చేశా… నేనే ప్రారంభిస్తున్నానంటూ..” గొప్పలు చెప్పుకోవడమే తప్ప వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఖర్చుచేసింది ఏమీలేదని, వెలిగొండపై క్రెడిట్ చోరీకి పాల్పడుతూ కూటమి నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మండి పడ్డారు.
ఎమ్మెల్యే తాటి పర్తి చంద్రశేఖర్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి శని వారం మార్కాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బూచేపల్లి మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు 31 సంవ త్సరాలుగా కొనసాగుతోందని అందులో సుమారు 15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్ర బాబు నాయుడు కేవలం 6 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులను చేపట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు రెండు టన్నె ళ్లలో మెజార్టీ పనులను చేపట్టారని చెప్పారు. గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల డ్యాంలు వైఎ స్సార్ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు టన్నెల్స్ ను మాత్రమే జాతికి అంకితం చేశార ని, ప్రాజెక్టును కాదని టీడీపీ నాయకులు, డ్రామా నాయుడు గుర్తు చేసుకోవాలన్నారు. ఇంకా రూ.3500 కోట్లు ఖర్చుచేసి అసంపూ ర్తిగా ఉన్న ఫీడర్ కెనాల్ను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రజలను మోసం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తిచేసిందని గొప్పలు చెప్పుకుంటూ ట్రాక్టరు, బైకు ర్యాలీలు, జలాభిషేకాలంటూ పండుగ చేసుకోవడం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలకే చెల్లిందన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ఎవరి హయాం లో ఎంతమేర పనులయ్యాయో ప్రతి ఒక్క రికీ తెలుసునని, టీడీపీ చేసే దుష్ప్రచారం ప్రజలు నమ్మరని తెలిపారు.
చంద్రబాబుది శిలాఫలకాల రాజకీయమే: తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే
వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో 30 ఏళ్ల కాలంలో చంద్ర బాబుది కేవలం శిలాఫలకాల రాజకీయమే. 15 ఏళ్లు ముఖ్యమం త్రిగా ఉన్న చంద్రబాబు తవ్విన టన్నెల్ కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే. హెడ్ వర్క్స్, టన్నెలింగ్ లాంటి క్లిష్టమైన పనులను వదిలేసి, కాలువల తవ్వకాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రోజు వరకు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లలో చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం రూ.2,100 కోట్లు మాత్రమే. జగన్ టన్నెల్స్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే తప్పుబట్టిన వారు, ఇప్పుడు పునరావాసం కల్పించకుండా నీళ్లు వదలడాన్ని ఎలా సమర్ధించుకుంటారు? అర్హత ఉన్న నిర్వాసితులందరికీ పరి హారం చెల్లించకుండా ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారో సమాధానం చెప్పాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు కల్పించాల్సిన కనీస కాలవ్యవధిని కూడా తుంగలో తొక్కారు. కాగ్ నివేదికల ప్రకారం గతం నుంచీ చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలకు పాల్పడిం ది. రాజశేఖరరెడ్డి చేసిన 75 శాతం పనులకు కనీసం ధన్యవాదాలు చెప్పకుండా ప్రాజెక్టు ప్రారంభించడం అన్యాయం.
శంకుస్థాపన తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: కేపీ కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
వెలిగొండ ప్రాజెక్టుకు 2006లో చంద్రబాబు కేవలం శయస్థాపన మాత్రమే చేశాడు. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.25 కోట్లు మంజూరు చేశారే తప్ప ఖర్చుచేసిందిలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004లో మార్కాపురం వచ్చి మళ్లీ ప్రాజెక్టు కు కుస్థాపన చేశారు. దోర్నాల సమీపం లో కొత్తూరు వద్ద మొదటి టన్నెల్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏకంగా రూ.3.461 కోట్లు మంజూరు చేశారు. మొదటి టన్నెల్ సరిపోదని ఇంజి నీర్లు చెప్పడంతో, ఆర్ధిక మంత్రి రోశయ్యతో మాట్లాడి రెండో టన్నెల్ కూడా మంజూరు చేయించారు. వైఎస్సార్ హయాంలోనే మెజార్టీ టన్నెలు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనులు పక్కనపెట్టి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఫీడర్ కెనాల్స్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రాజెక్టులో 75 శాతం పనులు రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని ప్రజలు గమనించాలి.
ప్రభుత్వానికి నిర్వాసితుల పట్ల మానవత్వం లేదు: జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఈ ప్రభుత్వం ఏమాత్రం మానవత్వం లేకుండా నిర్వాసితులను రోడ్డున పడేయడం చాలా దారుణం. ఆరునెలల ముందు నోటీసులు ఇచ్చి, ఇళ్ల పట్టాలు అందజీసిన తర్వాతే వారిని ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ చంద్ర బాబు నాయుడు ఆకస్మికంగా అధికారులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నెలాఖరులోపు ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇళ్లు లేక, కనీస సౌకర్యాలు లేక వృద్ధులు, పిల్లలు, మూగజీవాలతో కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది ప్యాకే జీలు ఇచ్చి, వాళ్లు ఇళ్లు కట్టుకునేంత సమయం ఇవ్వకుండా హడావుడిగా ప్రాజెక్లును ఎలా ప్రారంభిస్తారు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్ నీళ్లు వ దలడాన్ని తాత్కాలికంగా అలస్యం చేశారు. కనీస ప్యాకేజీలు ఇవ్వకుండా జిల్లా ప్రజలను వేధిస్తూ డబ్బా కొట్టుకో వదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
తండ్రీకొడుకులే 82 శాతం పనులు పూర్తి చేశారు: అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే
మూడు దశాబ్దాల పశ్చిమ ప్రకాశం ప్రజల అయిన వెలిగొండ ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్య ఎంతో పోరాటం చేశారు. 1996 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికా కంలోకి వచ్చాకే అమెరికా, జర్మనీల నుంచి అధునిక టన్నెల్ బోరింగ్ యంత్రాలను తెప్పించారు. 37 కిలోమీటర్ల టన్నెట్లో రాజశేఖరరెడ్డి 20 కిలోమీటర్లు, జగన్ 11 కిలోమీటర్లు పూర్తి చేశారు. తండ్రీకొడుకులే 82 శాతం పనులు పూర్తి చేయగా, చంద్రబాబు కేవలం 6 కిలో మీటర్లు మాత్రమే తవ్వారు. వైఎస్ జగన్ రెండు టన్నెళ్లను జాతికి అంకితం చేస్తూ, నిర్వాసితు లకు న్యాయం వేశాకే నీళ్లు వదులుతామని స్పష్టంగా చెప్పారు. కనీసం నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.905 కోట్ల ప్యాకేజీని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదు. ఇంకా రూ.3,500 కోట్ల పనులు పెండింగ్లో ఉండ గానే ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం దారుణం డిజైన్ ప్రకారం 4.45,000 ఎకరాలకు సాగు నీరు ఇచ్చినప్పుడే ఈ ప్రాజెక్టు నిజంగా పూర్త యినట్లు లెక్క ఫీడర్ కెనాల్స్ ద్వారా పాడావు డిగా నీళ్లు వదులుతూ, రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు.
తీగలేరు పనులు పూర్తికాకుండా నీళ్లు ఎలా ఇస్తారు. కే నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
వెలిగొండ ప్రాజెక్టు అనేది ప్రకాశం జిల్లా వాసుల సెంటిమెంట్. దీనిని కేవలం ఓట్ల రాజకీయంగా చూడకూడదు. చంద్రబాబునాయుడు ఎక్కడ శిలాఫలకాలు వేస్తే అక్కడ అడవులు మొలి దాయే తప అభివృద్ధి జరగ లేదు. ప్రాజెక్టు కోసం భూసేకరణ, అనుమతులు అన్నీ వైఎస్సార్ హయాంలోనే జరిగాయి. గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల డ్యాంలను కట్టి, రైతులకు నష్టపరిహారం చెల్లించిన ఘనత కూడా వైఎస్సార్ దే . తీగలేరు కెనాల్ పూర్తి చేయకుండా వ్యవసాయ భూములకు నీళ్లు ఎలా ఇస్తారో కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. నిర్వాసితుల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన స్కూల్ భవనంలో కలెక్టరేట్ పెట్టుకోవడం వీరి దిగ జారుడుతనానికి నిదర్శనం. ప్రభుత్వం ఆర్ ఎస్ ఆర్ ప్యాకేజీ కింద రూ.1901 కోట్లు కేటాయించి జీవో ఇస్తే, ఈ ప్రభుత్వం దాన్ని నీరుగార్చింది. సంపన్నులకు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే ఈ ప్రభుత్వం, పేద నిర్వాసితు లకు మాత్రం అన్యాయం చేస్తోంది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించడం వల్ల రైతులు రెండు వేల ఎక రాల్లో వేసిన పంటను నష్టపోయారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి, ఆధునిరంగా రూపుదిద్దుకునేలా చేసిన వైఎస్సార్ కుటుం బానికే ఈ ప్రాజెక్టు క్రెడిట్ దక్కుతుంది.
వెలిగొండకు పూర్తి చేసింది వైఎస్సారే:ఉడుముల శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
వెలిగొండ ప్రాజె క్టుకు కోసం శిలా ఫలకం వేసిన చంద్రబాబు సుమారు 15 సం వత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్టు కోసం ఖర్చుచేసింది ఏమీలేదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుచేసుకోవాలి. రూ.1650 కోట్లతో గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల డ్యామ్లను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును పక్కనపెట్టిన చంద్ర బాబు నాయుడు తరువాత అధికారంలోనికి వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి పశ్చిమ ప్రాంత ప్రజల జీవనాడిగా గుర్తించి సుమారు 75 శారం వరులను ఐదేళ్లలో పూర్తి చేశారు. ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటే. పశ్చిమ ప్రకాశం ప్రజలకు వెలిగొండను నేనే ప్రారంభిస్తున్నా అని చెప్పటం వెన్నుపోటు పాడవటమే.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర కార్యదర్శి షంషేర్ అలీబేగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృ ష్ణ అన్నా కృష్ణచైతన్య, పార్టీ పట్టణ ఆధ్య క్షుడు షేక్ సలీమ్, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, సురేడ్డి రామసుబ్బారెడ్డి, చెందిరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి నివాళులులు అర్పించి పాలాభిషేకం చేశారు .

