బేగంపేట ఆగస్టు 30 (జే ఎస్ డి ఎం న్యూస్) : బెగంపేటలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్ పార్కింగ్‌లో ఉంచిన సుమారు రూ.40 వేల విలువైన విద్యుత్ సైకిల్ చోరీకి గురైంది. గురుమూర్తి లేన్‌లోని ఆల్రిచ్అపార్ట్మెంట్స్లోనివాసముంటున్న చాడ జీవన్‌కుమార్ (45) ఈ మేరకు బెగంపేటపోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం. ఆగస్టు 28న సాయంత్రం పిల్లలు విద్యుత్ సైకిల్‌పై ఆడుకుని సుమారు రాత్రి 7.30 గంటలకు అపార్ట్మెంట్ సెల్లార్ పార్కింగ్‌లో సైకిల్‌ను నిలిపి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం సెల్లార్‌కు వెళ్లి చూడగా సైకిల్ కనిపించలేదు.
అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ ప్రాంగణంలోకి ప్రవేశించి, సైకిల్‌ను తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసి, నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి, విద్యుత్ సైకిల్‌ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు. కేసు నమోదు చేసుకున్న బెగంపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బెగంపేటలో విద్యుత్ సైకిల్ చోరీ.
30
Aug