పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు….ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట ఆగస్ట్ 30,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక లు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్ పేట డివిజన్ లోని పలు ప్రాంతాలలో నిర్వహించిన శ్రావణ మాసం బోనాల వేడుకలలో పాల్గొన్నారు. ముందుగా కళాసిగూడా లోని శ్రీ జూలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్ లోని అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో గల శ్రీ గాలి మైసమ్మ అమ్మవారి ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఇందిరా నగర్ లోని శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, గణేష్, సతీష్, కొండాపురం మహేష్ యాదవ్, కోటేశ్వర్ గౌడ్, టీనా, జనార్దన్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *