పద్మారావునగర్ ఆగస్ట్ 30,(జే ఎస్ డి ఎం న్యూస్)
దేశ చరిత్ర, సంస్కృతి, విశిష్టతలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 31న (నేడు) దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ‘భారత్ కో జానో’ జనరల్ నాలెడ్జ్ రాతపరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది, తెలంగాణలోని 21 శాఖల పరిధిలో దాదాపు లక్ష మంది విద్యార్థులతో ఈ పరీక్షను ఒకే రోజు, ఒకే సమయంలో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర కృష్ణ పసుపులేటి, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ తెలిపారు.
ఈ పరీక్షను జూనియర్ (6, 7, 8 తరగతులు), సీనియర్ (9, 10, ఇంటర్) విభాగాలుగా విభజించి నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, జాతీయ చైతన్యం, భారతీయ సంస్కృతి పట్ల గర్వభావాన్ని పెంపొందించి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పరీక్షను విజయవంతం చేయడంలో పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
నేడు కోటి మందితో ‘భారత్ కో జానో’ రాతపరీక్ష–తెలంగాణలో లక్ష మంది విద్యార్థుల భాగస్వామ్యం
30
Aug