బేగంపేట ఆగస్ట్ 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పేద ప్రజలు సంతోషంగాఉండాలని తానుఎల్లప్పుడూ కోరుకుంటానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారంపద్మారావు నగర్ లోని హమాలీ బస్తీ లో గల కమిటీ హాల్ పై సీల్ వెల్ కార్పొరేషన్ ఫ్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనూతనంగా నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సీల్ వెల్ సంస్థ అధినేత బండారుసుబ్బారావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బస్తీ వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, బండారుసుబ్బారావు ను ఘనంగా సన్మానించి తమ సమస్యలపరిష్కారానికి కృషి
చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీ ప్రజలకు ఏ అవసరమొచ్చినా తాను అన్ని వేళలా అండగా నిలుస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బస్తీ ప్రజలు చిన్న చిన్న ఫంక్షన్ లను చేసుకునేందుకు ఎలాంటి ఆర్థికభారం పడొద్దనే ఆలోచనతోనే కమిటీ హాల్ ను నిర్మించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఫంక్షన్ లకు అవసరమైన వంట సామగ్రి ని కూడాఅందించామని చెప్పారు. ఆ వంట సామాగ్రిని భద్రపర్చడానికే బండారు సుబ్బారావు సహకారంతో నూతనంగా రేకుల షెడ్డునునిర్మించినట్లు తెలిపారు. ఇవే కాకుండా బస్తీ లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి అనేక సమస్యలు పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బస్తీ వాసులుకలిసికట్టుగా ఉండాలని, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తేపరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బస్తీ వాసులు సుభాష్, సత్యనారాయణ, శ్యామ్, కుషాల్, రవి, కౌసల్య, దుర్గ, నాయకులు ప్రేమ్, లక్ష్మీపతి, ఏసూరి మహేష్,వెంకటరమణ, రాజేందర్, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


