హైదరాబాద్, ఆగస్టు 31,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నడక,పరుగు తో పాటు మానసిక దృఢత్వం కలిగి ఉండాలనీ విన్ ఫో సొల్యూషన్స్ సంస్థ సి ఈ ఓ హరి సేతల పతి అన్నారు.
ఎన్ ఎం డి సి హైదరాబాద్ మారథాన్ 10K రన్ ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. విన్ ఫో సొల్యూషన్స్ సంస్థ సి ఈ ఓ
హరి సేతలపతి నాయకత్వం , ప్రోత్సాహంతో ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యం, ఫిట్నెస్, ఐక్యతను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో 9 ఏళ్ల వయసు కలిగిన యువరాజు ఆరెడ్ల పాల్గొని, నిర్ణీత సమయంలో 10K పరుగును విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణం. చిన్నారులను ఫిట్నెస్, చురుకైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో యువరాజు సాధించిన ఈ విజయం తెలియ జేసింది.యువరాజు తండ్రి, విన్ ఫో సొల్యూషన్స్ లో అసోసియేట్ డైరెక్టర్. గా ఉన్న బాల రాజు ఆరెడ్ల, తన కుమారుడి విజయంపై
ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించడం అలాగే ఆరోగ్యం, ఫిట్నెస్, ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిని పెంపొందిస్తున్నందుకు విన్ ఫో సొల్యూషన్స్ యాజమాన్యానికి, సి ఈ ఓ హరి సేతలపతికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేశారు.ఇలాంటి మారథాన్ లు నగరంలో నిర్వహించడం ఎంతో అవసరం అని,నిత్యం పని ఒత్తిడితో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇలాంటి మారథాన్ లు ఉపశమనం కలిగిస్తాయని బాల రాజ్ అరెడ్ల అభిప్రాయం వ్యక్తం చేశారు.




