బేగంపేట సెప్టెంబర్ 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ కస్టమ్స్ బస్తీ బ్రిడ్జి కింద కేబుల్ పైపులు కిందికి జారి వాహన దారులకు ప్రమాదంగా మారింది.ఫతే నగర్ , బల్కంపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు,ప్రతి రోజూ సమీపంలోని ఓ ప్రయివేటు పాఠశాల కి వచ్చే వాహనదారులకు కూడా ప్రమాదంగా తయారైంది.నిత్యం వందలాది వాహనాలు ఉదయం సాయంత్రం పాఠశాల వద్ద చిన్నారులను వదిలి పెట్టి తీసుకెళ్లేందుకు వస్తుంటాయి.వాటికి జారిన కేబుల్ పైపు లు ప్రమాదంగా తయారయ్యాయి.వెంటనే అధికారులు కిందికి జారిన కేబుల్ పైపులను సరిచేయించాలని వాహన దారులు ,స్థానికులు కోరుతున్నారు.
