తాగు బోతులకు అడ్డగా తాతా చారి కాలనీ ఆటస్థలం….ఓపెన్ జిమ్ కు వచ్చే వారికి,విద్యార్థులకు ఇబ్బందిగా మారిన వైనం….పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలంటూ పోలీస్ కమ్యూనిటీ గ్రూప్ లో స్థానికుల పోస్టులు.

బేగంపేట సెప్టెంబర్ 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తాగు బోతులు ఏ ఒక్క స్థలాన్ని వదలడం లేదు.రోడ్డు,బస్టాప్ లు,శ్మశాన వాటికలు చివరికి విద్యార్థులు,స్థానికులు వాకింగ్ కు,జిమ్ కు ఉపయోగించుకునే పార్కులను సైతం వదలడం లేదు.తాజాగా తాతా చారి కాలనీ పార్కు లో మందుబాబులు మద్యం పార్టీ చేసుకుని ఖాళీ మద్యం సీసాలు,వాటర్ బాటిళ్లను అక్కడే పడవేసి వెళ్లారు.ఉదయం వాకింగ్,జిమ్ చేసుకుందుకు పార్కు కు వచ్చిన కొందరు వాటిని తమ మొబైల్స్ లో చిత్రించి బేగంపేట పోలీస్ కమ్యూనిటీ గ్రూప్ లో పోస్ట్ చేశారు.పార్కు లో ప్రతి రోజు ఉదయం,సాయంత్రం స్థానికులు వాకింగ్.జిమ్ చేస్తుంటారు.అలాగే సమీప పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడే ఆటలు ఆడుకుంటారు.ప్రభుత్వం తరుపున సంక్షేమ కార్యక్రమాలను సైతం ఇక్కడ నిర్వహిస్తుంటారు.చుట్టూ నివాసాల మధ్య ఉన్న ఈ పార్కు లో మందు బాబులు మద్యం పార్టీ చేసుకోవడం పై. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాతా చారి కాలనీ అసోసియేషన్ సభ్యులు కూడా బాధ్యత తీసుకుని ఎంతో మందికి ఉపయోగ పడుతున్న ఈ పార్కుకు వాచ్ మెన్ ను నియమించి రాత్రి వేళ గేట్ కు తాళం వేసేలా చూడాలని,పోలీసుల పహరా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *