చదువుతోనే పేదరిక నిర్మూలన- రాష్ట్రపుడ్ కార్పోరేషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి

కష్టపడి చదివి ఉన్నతులుగా ఎదిగితే పేదరికం నిర్మూళన అవుతుందని రాష్ట్రపుడ్ కార్పోరేషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని శివరాంపురం గ్రామంలో రేషన్ షాపు, హైస్కూల్, తాళ్లూరులో కేజీబీ విద్యాలయంను ఆయన బుధవారం సందర్శించారు. తనిఖీలో పలు అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన కేజీబీవీలో బాలికలతోమాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం పెద్ద పీట వేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిధులతో విద్యాలయాలను ఏర్పాటు చేసి మంచి భోజనం, వనతి, అత్యుత్తమభోధన అందిస్తున్నదన్నారు. పేద విద్యార్థులకుప్రభుత్వాలు అండగానిలుస్తూ కోట్లాది రూపాయలు విద్యాభి వృద్ధికి కేటాయిస్తున్నారన్నారు. పేదవర్గాలకు హక్కుగా ప్రభుత్వాలు నిధులు వెచ్చిం చి వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యాభోధన చేస్తున్నదన్నారు. వనతి గృహాలందు శాలను నద్వినియోగం చేసుకుని ఉన్నతులుగా ఎదిగి తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చాలన్నారు. విద్యాబోధన సమయంలో ఏదైనా అర్థంకాకుంటే మిన్న కుండకుండా పలుసార్లు పట్టుదలతో అర్ధంకాని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తే విజయం సాధించ వచ్చునన్నారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 575 మార్కులు సాధించి విద్యాలయంకు మంచి పేరుతీసుకరావాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు కస్తూరిబాలో నమస్యలు పునరావృతం కాకుండా చూడాలి.…….

కస్తూరిభా విద్యాలయం లో చిన్న చిన్న సమన్యలు వున్నాయని వాటిని పునరావృ తం కాకుండా చూడాలని ప్రిన్సిపల్ సుజితకు సూచించారు. పాలు పలుచగా శుభ్రంగా వుండటం లేదని, నీటి సమస్య వున్నదని బాలికలు తమకు తెలిపారన్నారు. వంట మనుషులను, కావెంజర్సు పిలిచి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా విద్యాలయ బాలికలు తమ వారిగా భావించి వారికి తగిన విధంగా సహకరించాల న్నారు. కేజీబీవీ విద్యాలయం నిర్వహణ నక్రమంగా వుందన్నారు. శివరాంపురం హైస్కూల్ లో మద్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు. గ్రామంలోని రేషన్ దుకాణంలో నిల్వ వున్న స్టా పరిశీలించారు. బియ్యం తరుగు లేకుండా ఇస్తున్నారా అని డీలర్ను అడిగి తెలుసుకున్నారు. చక్కెర కిలో రూ17 కే ఇస్తున్నారా లేక రూ20 ఇస్తే డీలర్ చిల్లర ఇవ్వటం లేదా అన్నికార్డుదారులను అడుగగా రూ. 3 చిల్లర ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ నరఫరా చేస్తే నిత్యావసర వస్తులు, పేదవర్గాలకు అందుతున్న మద్యాహ్న భోజన నిర్వహణలో అక్రమాలుజరిగితే సహించేది లేదన్నారు. విద్యార్థులకుతయారు చేసిన భోజనాన్ని రుచి చూశారు. ఆయన వెంట డిఎన్ పదృశ్రీ జీసీడీవో హేమలత, డిప్యూటీ డీఈవో రంగయ్య, సీడీపీవో ఆర్ పరిమిళ ఎంఈవోలు జి. సుబ్బయ్య, ఎల్ సుధాకర్, ఎన్ఫోర్సు మెంట్ డీటీ రాధాకృష్ణ, మం డల డీలర్ల సంఘం అధ్యక్షులు పిన్నికరమేష్, ప్రిన్సిపల్ నుజిత, తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *