టిడిపి కొవ్వొత్తుల ప్రదర్శన

నాగులుప్పలపాడు, సెప్టెంబర్ 9, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఒక అసత్య కేసులో చట్టవిరుద్ధంగా అప్పటి వైఎస్ఆర్ పార్టీ అక్రమంగా నిర్బంధించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయింది. ఆచీకటి రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు ఉప్పుగుండూరులో నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎదుట బుధవారం రాత్రి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కనగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత, రాష్ట్ర ప్రజలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగు వారందరూ ఆయనకు మద్దతుగా తరలివచ్చారు. దేవుని సంకల్పం ప్రకారం ఆయన నిర్దోషిగా నిరూపించబడ్డారు, చివరికి నిజమే గెలిచింది. ప్రపంచంలోని తెలుగు వారందరూ ఒక్కటై వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చీకటి పాలనను అంతం చేసి కూటమి ప్రభుత్వంను అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు చేసుకున్నామని ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉందని శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రజలందరూ దుష్ట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తున్నారని తిరిగి ఆ చీకటి రోజులు రాకుండా ఉండాలని కోరుతున్నామన్నారు కొవ్వొత్తుల ప్రదర్శనలో మండల తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కూతంబాకం సెల్వం, టిడిపి సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లం. వెంకటేశ్వర్లు,టిడిపి యూనిట్ ఇంచార్జ్ కుంచాల నాగరాజు,బూత్ కమిటీ కొప్పర్తి నాగయ్య,సొసైటీ డైరెక్టర్,మసిముక్కు భాస్కరరావు, గద్దె త్యాగరాజు ఉప్పుగుండూరు లక్ష్మీనారాయణ, కత్తి నాగార్జున, తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పిన్నక శ్రీకాంత్, నియోజకవర్గం టిఎన్టిసి ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాసరావు, మండల టీడీపీ పార్టీ కార్యదర్శి గద్దల రమేష్,జనసేన పార్టీ మండల కార్యదర్శి నిడికొండ వెంకట్, సాదినేని ఆంజనేయులు,గుమ్మడి వెంకటేశ్వర్లు, బెల్లం హరిబాబు , కొండేటి జలంధర్,బెల్లం శ్రీనివాసరావు, సింగరయ్య, శవనం వసంతరావుకొంజేటి రామకృష్ణ, జూపూడి బాబురావు,యేనిగండ్ల వెంకన్న, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *