ప్రజలందరూ ఐకమత్యంగా మెలుగుతూ
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎస్సై శింగంశెట్టి మల్లికార్జునరావు అన్నారు. బొద్దికూరపాడులో మంగళవారం రాత్రి ఆయన పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల స్టోరీలపై ఇతర పరిస్థితులపై చర్చించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.


