తాళూరు మండలంలోని రామభద్రాపురం ఎర్త్ డ్యామ్ కు కరువది మేజర్ నుండి సాగర్ నీటిని నింపి రామభద్రాపురం, నాగంబొట్లపాలెం, తూర్పుగంగవరం, సోమవర్పాడు గ్రామ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడాలని చీమకుర్తి ఇరిగేషన్ ఈఈకి ప్రజలు గురువారం విన్నవించారు. వర్షాలు కురవక పోవటంతో నీరుఅడుగంటి ప్రజలు నీటిఎద్దడి ఏర్పడిందని చెపాపఉ.ఎర్త్ డ్యామ్ పక్కగుండానే కరువది కెనాల్ వున్నందున ప్రజల కష్టాలను గుర్తించి ఎర్త్ డ్యాంకు కరువది కాలువ నుండి నీటిని విడుదల చేస్తే నిండుతుందన్నారు. దీంతో ఆగ్రామాల ప్రజలకు కొంత మేర నీటి న మన్య తీరుతుందన్నారు. సొసైటీ అధ్యక్షులు వల్లపునేని నుబ్బయ్య, పుల్లారెడ్డి, జాష్టి రమణయ్య, వై.పుల్లారెడ్డి, ఆదినారా యణ తదితరులు పాల్గొన్నారు.
