వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ పోటీల్లో యువత పాల్గొనాలి -జిల్లా యువజన అధికారి ఏ.వి. నరసింహ కుమార్

వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో ప్రకాశం జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా యువజన అధికారి ఏ.వి. నరసింహ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మేరా యువ భారత్–ప్రకాశం (ఒంగోలు) కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో యువత పాత్రను మరింత పెంపొందించడంతో పాటు, యువతలో నాయకత్వ లక్షణాలను, సాధారణ జ్ఞానాన్ని మరియు దేశం పట్ల అవగాహనను పెంపొందించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా యువత కోసం ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లాలోని 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువత మై భారత్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకుని ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు. క్విజ్‌లో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయని, వాటికి సమాధానాలు ఇవ్వడానికి 10 నిమిషాల సమయం కేటాయించబడుతుందని తెలిపారు.

క్విజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం పాల్గొనేవారికి సర్టిఫికేట్ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యువత తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడంతో పాటు, వికసిత్ భారత్ నిర్మాణంపై మరింత అవగాహన పొందేందుకు ఈ క్విజ్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.

ప్రస్తుత యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, దేశ అభివృద్ధి, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా యువజన అధికారి తెలిపారు. యువత ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ ప్రతిభను, ఆలోచనా విధానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.

ఈ నెల 30వ తేదీ క్విజ్‌లో పాల్గొనేందుకు చివరి గడువు అని జిల్లా యువజన అధికారి స్పష్టం చేశారు. గడువు సమీపిస్తున్నందున జిల్లాలోని అర్హత కలిగిన యువత ఎటువంటి ఆలస్యం చేయకుండా మై భారత్ వెబ్‌సైట్ ద్వారా క్విజ్‌లో పాల్గొనాలని కోరారు.

జిల్లాలోని 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ ఆన్‌లైన్ క్విజ్ పోటీలో పాల్గొనాలని జిల్లా యువజన అధికారి ఏ.వి. నరసింహ కుమార్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *