9వ జాతీయ పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయండి

9వ జాతీయ పోషణ మాస ఉత్సవాలు 9.9.2026 నుండి8.10.2026 వరకు జరగనున్నాయి. దీనిలో ఈరోజు PGRS సమావేశపు హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధ్యక్షతన పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమమునకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి doc వేంకటేశ్వర రావు , జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక , జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఆహారము వైవిధ్యము తగినంత ప్రోటీన్, అంగన్వాడి కేంద్రాలలో తాజా వేడి భోజనం, సమాజ భాగస్వామ్యం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన మరియు పోషణ మరియు బాల్య పూర్ ప్రాథమిక విద్య అంశముల మీద సమావేశం నిర్వహించడమైనది. కార్యక్రమంలో భాగంగా పురుషులతో వంట ప్రదర్శన మరియు ఆరోగ్యవంతమైన శిశువులను గుర్తించి వారికి బహుమతులు ఇవ్వడమైనది. గర్భవతులను ఉద్దేశించి ప్రధానమంత్రి మాతృ వందల యోజన పథకం కింద నమోదు చేయడమైనది. వారికి పోషక విలువలు కలిగినటువంటి మునగాకు పొడిని కూడా సఫరా చేయడమైనది. ఆరోగ్యవంతమైన పిల్లలకు జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు ఇప్పించారు . ఈ సమావేశంలో జిల్లాలోని సిడిపివోలు మరియు సూపర్వైజర్లు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *