అమరావతి సచివాలయంలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సుల్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై చర్చ జరిగింది. ఇందులో ప్రకాశం జిల్లా స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో మిగిలిన జిల్లాలను వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది. వ్యవసాయ,అనుబంధ రంగాల్లో గత ఏడాది,ఈ ఏడాది త్రైమాసిక ఫలితాలు చూసుకుంటే ప్రకాశం జిల్లా 7వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు ఎగబాకింది. 2025-2026 ఆర్థిక సంవత్సరం 2,388 కోట్లతో 7వ స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.3,202 కోట్లు అనగా 34.09 శాతం వృద్దితో 5వ స్థానానికి ఎగబాకిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తన ప్రెజెంటేషన్‌లో తెలిపారు.
దీనిపైన ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇది శుభ పరిణామమన్నారు.
ప్రకాశం జిల్లాలో నమోదైన 34.09 శాతం వృద్ధి రాష్ట్ర Agriculture & Allied Sector వృద్ధి రేటు 14.19 శాతం కంటే గణనీయంగా అధికం.
వృద్ధి రేటులో వెనుకబడిన జిల్లాలు ఈ స్ఫూర్తిని అందుకోవాలన్నారు…..

