తాళ్లూరు మండలంలో చాలా కాలం తర్వాత గురువారం మధ్యాహ్నం మంచి వర్షపాతం నమోదు అయినది. మండల కేంద్రంలో 50.2 మి.మీల వర్షపాతం నమోదు కావటంతో రైతాంగం కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే పశువుల మేత సైతం ఎండు ముఖం పట్టటం, భూ గర్భ జలాలలు అడుగంటిపోవటంతో పలు చోట్ల పశువుల ఫారం రైతులు తమ పశువులను తెగ నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కసారిగా సాయంత్రం రెండు గంటల పాటు వర్షం కురిసింది. అయితే ఈ వర్షంతో తాళ్లూరులో రోడ్లని జలమయం అయి మౌళిక వసతుల లేమిని బయట పెట్టాయి. నివాసాలలోనికి నీరు చేరటంతో ఆ ప్రాంతాల గృహాల వారు ఇబ్బందులు పడ్డారు.

